గుంటూరులో కేంద్ర యోగా పరిశోధన సంస్థ
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్) ఏర్పాటు కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 15.03 ఎకరాల్లో నిర్మించనున్న ఈ సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపిందన్నారు. మూడు నెలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసి కేంద్రానికి అప్పగిస్తామని, 2028లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Login
Comments (0)