బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. కాకినాడ – కళింగపట్నం మధ్య తీరం దాటే సూచనలున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
Don’t receive OTP? Resend