బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా బాధ్యతలను సమర్థంగా నిర్వహించలేకపోతున్నానని ఆయన స్పీకర్ హఫీజ్ ఉద్దీన్కు లేఖ రాశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు ప్రకటించారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు హఫీజ్ ఉద్దీన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. పదవిలో దిగిపోయి భారత దేశంలో తలదాచుకుంటున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఆయన నియమితులయ్యారు. ఆయన ఇటీవల షేక్ హసీనాతో మాట్లాడారనే ఆరోపణల నేపధ్యంలో ఈ రాజీనామా జరిగింది.
Login
Comments (0)