అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. శుక్రవారం కూటమి సభలో మాట్లాడుతూ, కూటమి అభ్యర్థికి వేసే ఓటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ అందరి మద్దతును పొందినట్లేనని అన్నారు. ఇక్కడ కూటమి తరఫున బిజెపి అభ్యర్థి కోట్ల అజేష్ యాదవ్ పోటీలో ఉన్నారు.
Don’t receive OTP? Resend