తెలంగాణ కంటే ఏపీలో వర్షపాతం తక్కువగా ఉన్నా అక్కడ కరవు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చంద్రబాబు ముందుచూపుతో నీటిని ఎత్తిపోశారని, అందుకే ఏపీలో కరవు, క్రాప్ హాలిడే పరిస్థితులు లేవని ప్రశంసించారు. ఈ విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో లోటు వర్షపాతం 17 నుంచి 20 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి కారణంగానే రాష్ట్రంలో కరవు ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు.
Don’t receive OTP? Resend