అమరావతి: సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘ఎస్’ ఆకారపు మలుపులపై నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రోడ్డు ఉండవల్లి, మంగళగిరికి కనెక్ట్ చేశామని, ఫేజ్-3లో విజయవాడ-చెన్నై జాతీయ రహదారి-16ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపింది. భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలకు అనుగుణంగానే ప్రస్తుత రహదారిని నిర్మించినట్లు పేర్కొంది. కరకట్టపై ట్రాఫిక్ తగ్గించడం కూడా లక్ష్యమని వివరించింది.
Don’t receive OTP? Resend