అమరావతి: రాజధానిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అత్యాధునిక ఆసుపత్రి క్యాంపస్ ఏర్పాటుకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం సమీపంలో ప్రభుత్వం 12 ఎకరాల భూమిని కేటాయించింది. భూమిపూజ కార్యక్రమంలో ఎల్వీపీఈఐ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావుతో పాటు మంత్రులు, సీఆర్డీఏ అధికారులు, ప్రముఖులు పాల్గొననున్నారు. అత్యాధునిక కంటి చికిత్సలు, పరిశోధనలు అందుబాటులోకి రానున్నాయి.
Don’t receive OTP? Resend