అమరావతి రాజధాని పరిధిలోని శాఖమూరులో రూ.597 కోట్లతో విజ్ఞాన సాంస్కృతిక ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. 19.12 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ఏపీ రాష్ట్ర ప్రజా గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (జీఐజీజీ) ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచస్థాయి రాజధానికి అవసరమైన విద్యా, సాంస్కృతిక, సంస్థాగత సౌకర్యాలను ఒకేచోట అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Don’t receive OTP? Resend