హార్వర్డ్ యూనివర్శిటిలో చేరిన సిఎం రేవంత్ రెడ్డి
మసాచుసెట్స్: హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత కెన్నెడీ స్కూల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం (స్థానిక సమయం) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చేరారు. కార్యక్రమ పరిచయం, కోహార్ట్ ఇన్ట్రడక్షన్తో శిక్షణ మొదలైంది. ‘Leadership for the 21st Century’ కార్యక్రమంలో ‘అథారిటీ అండ్ లీడర్షిప్ విశ్లేషణ’పై తొలి సెషన్ జరిగింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి తరగతులు ప్రారంభమై, కేస్ అనాలిసిస్, గ్రూప్ వర్క్‌తో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. వారం పాటు, అంటే జనవరి 30వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీని ఫీజు 12,900 డాలర్లు (దాదాపు 12 లక్షల రూపాయలు).
Login
Comments (0)