హార్వర్డ్ లో కోర్సు పూర్తిచేసిన సిఎం రేవంత్ రెడ్డి
బోస్టన్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో స్వయంగా తెలియజేశారాయన. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే.
Login
Comments (0)