ఫేక్ పిజ్జా హట్ కి పాక్ రక్షణ మంత్రి రిబ్బన్ కటింగ్
డెస్క్: పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దానికి కారణం? పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేయటం. ఆ షాపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేశామని చెప్పింది. దీంతో దేశ రక్షణ శాఖ మంత్రి స్థాయి వ్యక్తి పిజ్జా దుకాణం ఓపెనింగుకి వెళ్లడమే హాస్యాస్పదం అని అనుకుంటే, అదీ దొంగ అవుట్ లెట్ కావటం పాక్ పరువు తీసింది.
Login
Comments (0)