నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్ఆర్ఏఐ సెక్రటరీ జనరల్ పవన్ కుమార్ తెలిపారు. అంకుశ్ భరద్వాజ్‌పై ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో 17 ఏళ్ల జాతీయస్థాయి మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అంకుశ్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా షూటర్ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. దిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా ఈ లైంగిక దాడి జరిగింది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్ గదిలో అంకుశ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
Login
Comments (0)