విశాఖ పాత విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేతపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, స్థానిక సమస్య కావడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
పిటిషనర్ వాదనలు
విశాఖకు చెందిన కొసరాజు గోపాలకృష్ణ దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, సరైన కనెక్టివిటీ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. గత మూడు దశాబ్దాలుగా సేవలు అందించిన విశాఖ విమానాశ్రయం అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ రూ.250 కోట్లకు పైగా వెచ్చించిందని వివరించారు.
న్యాయస్థానం స్పందన
భోగాపురం విమానాశ్రయం ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే దశాబ్దాల పాటు సేవలు అందించిన పాత ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నిలిపివేయడానికి సరైన కారణాలు లేవని పిటిషనర్ వాదించారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారించి తుది ఉత్తర్వులు వెలువరించింది.
Don’t receive OTP? Resend