విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఉన్న జె.ఎం.భక్షి కంపెనీకి చెందిన నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన నల్లటి పొగ నగర ఆకాశాన్ని కమ్మేసింది.
ప్రమాదం కారణంగా స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Don’t receive OTP? Resend