విశాఖపట్నం ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ నుంచి టెక్కలికి వెళ్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా, ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Don’t receive OTP? Resend