ప్రముఖ నూతన నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మికపై ఆన్లైన్లో కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తుండటంతో వారి టీమ్ తీవ్రంగా స్పందించింది. ఈ దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డీసీపీకి అధికారికంగా ఫిర్యాదు అందజేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంతో తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అసత్యపు పోస్టులు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫేక్ పోస్టులు, వీడియోలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల వివరాలు, యూఆర్ఎల్లు మరియు స్క్రీన్షాట్లను పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు. బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
బాధిత టీమ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి, ఐటీ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో సెలబ్రిటీలపై జరిగే అసత్య ప్రచారాలు, ఫేక్ వార్తల కట్టడికి ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.
Don’t receive OTP? Resend