ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లా పరిధిలో బద్రీనాథ్ నుంచి దేహ్రాదూన్‌కు బయలుదేరిన ఒక హెలికాప్టర్ మార్గమధ్యంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో పాటు మొత్తం ఆరుగురు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం అందడంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం, రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. గల్లూరైన వారిని గుర్తించేందుకు సహాయక చర్యల్లో భాగంగా మరో రెండు హెలికాప్టర్లను గాలింపు కోసం రంగంలోకి దించారు.
ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దట్టమైన మబ్బులు, ప్రతికూల పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు స్వల్ప ఆటంకం కలుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక లోపాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Don’t receive OTP? Resend