రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై ఓ వ్యక్తి రంపంతో దాడి చేశాడు. పదో తరగతి చదువుతున్న బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలికను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Don’t receive OTP? Resend