ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం రామాయణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విడుదల ముందే అడ్వాన్స్ సేల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే దేశవ్యాప్తంగా 137 నగరాలు మరియు పట్టణాల్లో 4,339 షోలకు గానూ 1.81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాలోని భారీ విజువల్స్ కారణంగా ఐమ్యాక్స్ థియేటర్లలో టికెట్లకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది.
ముంబయి, దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ఐమ్యాక్స్ థియేటర్లలో టికెట్ల ధరలు భారీగానే పలుకుతున్నాయి. ముంబైలోని కొన్ని థియేటర్లలో రిక్లెయినర్ సీటు ధర రూ.3,170 వరకు ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో రూ.1,550 నుంచి రూ.2,400 మధ్య ఉంది. పలు థియేటర్లలో మార్నింగ్ షోలు ఇప్పటికే పూర్తిగా హౌస్‌ఫుల్ అయ్యాయి. నవంబరు 5న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Don’t receive OTP? Resend