అమరావతి: రాప్తాడులో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని పరామర్శించేందుకు మంత్రి నారా లోకేశ్ ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించనున్నారు. మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరనున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
Don’t receive OTP? Resend