బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ తెలిపారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అవి నిరాధారమైనవని, అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులను బాధపెట్టడం, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు.
Don’t receive OTP? Resend