తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధును మండలి ప్రాంగణం నుంచి మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు. శాసనమండలిలో ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మీడియా పాయింట్ వద్ద అడ్డుకోలు
శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తాతా మధు ప్రయత్నించారు. అయితే ఆయనపై వేటు పడినందున మండలి ప్రాంగణంలో మాట్లాడడానికి వీలేదని అధికారులు తేల్చిచెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. దీంతో రంగంలోకి దిగిన మార్షల్స్ ఆయనను అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.
కాకతాళీయం కాదన్న భట్టి విక్రమార్క
మండలిలో చోటుచేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలు కాకతాళీయం కాదని, ఫామ్‌హౌస్‌లో చేసిన కుట్ర అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Don’t receive OTP? Resend