తెలుగు చిత్ర పరిశ్రమలో మరో జోడీ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ, నటి కావ్య కల్యాణ్‌రామ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఇరువురూ ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు.
అభిమానులతో సంతోషం పంచుకున్న జోడీ
జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండబోతున్నామని ప్రకటిస్తూ కాల భైరవ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్ట్ చేశారు. తమ బంధం గురించి అందరికీ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినీ ప్రస్థానం వివరాలు
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడైన కాల భైరవ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు హిట్ చిత్రాలకు ఆయన స్వరాలు అందించారు. మరోవైపు బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన కావ్య కల్యాణ్‌రామ్, కథానాయికగా మారిన తర్వాత మసూద, బలగం వంటి విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.
Don’t receive OTP? Resend