శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సహా: లైఫ్ ఆఫ్ సంజు'. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ విడుదల వేడుకలో చిత్ర బృందం పాల్గొని మాట్లాడింది.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ చిత్రం ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రేమలోని బాధ, త్యాగం, జీవితాన్ని మార్చే నిర్ణయాలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించామని చెప్పారు.
ప్రేక్షకులకు విజ్ఞప్తి చేయడం లేదని, ఛాలెంజ్ చేస్తున్నానని శ్వేత పేర్కొన్నారు. ఒకవేళ ఈ సినిమా చూసి ఎవరైనా నిరాశపడితే, తాను అమీర్‌పేట్ సెంటర్లో నిలబడి గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. మంచి కంటెంట్‌తో వస్తున్నామని, ఖచ్చితంగా హిట్ కొడతామని స్పష్టం చేశారు.
మరోవైపు హీరో శివ కుమార్ కాసారం మాట్లాడుతూ, ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందని చెప్పారు. ఒకవేళ అంచనాలు అందుకోలేకపోతే తనకు ఫోన్ చేసి తిట్టవచ్చంటూ తన ఫోన్ నంబర్‌ను బహిరంగంగా వెల్లడించారు. పెద్ద సినిమాల పోటీ నడుమ విడుదలై విజయం సాధించినప్పుడే పరిశ్రమ గుర్తస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Don’t receive OTP? Resend