గుంటూరు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా సినీ నటుడు జగపతిబాబు ప్రచారం చేశారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. లక్ష్మీ అపర్ణకు మంచి మనసు ఉందని, గుంటూరుకు మంచి చేస్తారని పేర్కొన్నారు. ఆమెతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులనూ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Don’t receive OTP? Resend