హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెరిగింది. ప్రధానంగా ఇండియా సిమెంట్స్ కేసుకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తిగా ముగిశాయి. ఇప్పటివరకు మొత్తం ఆరు సీబీఐ ఛార్జిషీట్లలోని డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం భారతీ సిమెంట్స్ కేసుకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రారంభమైంది. సీబీఐ కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు సీబీఐ కోర్టులో మొత్తం 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.
ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్తో పాటు వైవీ విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరుల తరఫున డిశ్చార్జి పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లన్నింటిపై కోర్టు ఒకేసారి తీర్పు లేదా తదుపరి ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది.
Don’t receive OTP? Resend