పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైసిపి నేత నవులూరి చెన్నారెడ్డి హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాట్లాడిన ఫోన్‌కాల్ వీడియో వెలుగులోకి వచ్చింది. చెన్నారెడ్డిని ప్రత్యర్థులు వాహనాలతో ఢీకొట్టి, అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పిన్నెల్లి వర్గపోరే హత్యకు కారణమని మృతుడి మామ రంగారెడ్డి ఆరోపించారు. జగన్‌తో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా భాస్కరరెడ్డి ‘మనవాళ్లే చంపేశారు’ అని పలుమార్లు ప్రస్తావించగా, జగన్ సారీ చెప్పి సంభాషణ ముగించారు.
పిన్నెల్లి, భాస్కరరెడ్డి, వైఎస్ జగన్ మధ్య సంభాషణ ఇలా సాగింది:
పిన్నెల్లి: అన్నా భాస్కరరెడ్డి (హతుడి తండ్రి) మాట్లాడతాడు
భాస్కరరెడ్డి: హలో..
జగన్: నమస్తే భాస్కరరెడ్డి అన్నా
భాస్కరరెడ్డి: నమస్తే అన్నా..
జగన్: జరిగిందంతా వింటున్నా.. ఇది చాలా అన్యాయం అన్నా
భాస్కరరెడ్డి: ఆ.. ఆ.. కార్లతో వెనుక ఒకటి ముందు ఒకటి ఫాలో అయ్యి.. కారుతో గుద్ది.. కారం జల్లి చంపి.. గొంతు కోసినారు.
జగన్: అరెరే.. ఎవరితో చేయించారు?
భాస్కరరెడ్డి: మనోళ్లే లే.. మనుషులు కూడా తేలినారు.. మనోళ్లే.
జగన్: ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని చేయించారా?
భాస్కరరెడ్డి: ఎమ్మెల్యే కాదు.. పాడు కాదులే.. మనోళ్లే.. సొంతోళ్లే.. బయటోళ్లు కాదు.. వేరే పార్టీ కాదు. మనోళ్లే.
జగన్: హ.. సారీ అన్నా..
భాస్కరరెడ్డి: హా..!
అనంతరం ఫోన్ పిన్నెల్లి చేతికి తీసుకున్నారు.
పిన్నెల్లి: అన్నా.. అన్నా.. మనవడే ఉన్నాడన్నా.. భాస్కరరెడ్డి అన్న మనవడు.
జగన్: భాస్కరరెడ్డి అన్నను చూసుకోండి.
(జగన్ ఫోన్ కట్ చేశారు)
రఫా రఫా ఇంటి నుండే ప్రారంభించారు? ఏమైనా వివేకానంద రెడ్డి గారి హత్య తరువాత అయినా ఆ పార్టీకి దూరంగా ఉండాలన్న జ్ఞానం లేకపోతే ఎలా??
Don’t receive OTP? Resend