న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని ఇండియా కూటమి ఇవాళ చేపట్టనుంది. శుక్రవారం ఢిల్లీలో వర్షం కారణంగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. మరోవైపు, నవంబరు 1న మింటో రోడ్–కనాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహించనున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సీఈసీ రాజీనామా చేయాలని కూటమి డిమాండ్ చేయనుంది.
Don’t receive OTP? Resend