కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. రెండు రాష్ట్రాల్లో నవంబరు 30 న తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు సవరించిన నూతన షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం అధికారులు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను మరింత పకడ్బందీగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించే ఉద్దేశంతోనే ఈ గడువును పొడిగించినట్లు సమాచారం. ఈ సవరించిన షెడ్యూల్‌కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
Don’t receive OTP? Resend