హైదరాబాద్లోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖపట్నానికి చెందిన రాజేశ్ (25) నాచారంలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. సోమవారం మాదాపూర్ అయ్యప్పసొసైటీలో తన స్నేహితులను కలిసేందుకు ఆయన వచ్చారు. అనంతరం నేరుగా కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లిన రాజేశ్, అక్కడి నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, రాజేశ్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి అసలైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు, చెరువులో దూకిన రాజేశ్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దుర్గం చెరువులో ఎన్డీఆర్ఎఫ్ మరియు డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. గజఈతగాళ్ల సహాయంతోనూ మృతదేహం ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Don’t receive OTP? Resend