హైదరాబాద్ మెట్రో రైల్ ఆన్లైన్ సేవల్లో శనివారం ఉదయం అనూహ్యంగా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో స్టేషన్లలో సెన్సార్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన వారు స్టేషన్ల లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి నానా తంటాలు పడ్డారు.
ప్రయాణికుల క్యూలైన్లు
ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్లోకి వచ్చే మరియు బయటకు వెళ్లే గేట్ల వద్ద ప్రయాణికులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు సిబ్బందిని ఆశ్రయించారు. అయితే సర్వర్ సమస్యల వల్ల అక్కడి సిబ్బంది కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
Don’t receive OTP? Resend