అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే కైలే
పామర్రు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైతో వాగ్వాదం, విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సెక్షన్ 41ఏ నోటీసు స్వీకరించకుండా తప్పించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఫోన్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నానని చెబుతున్నప్పటికీ, సాంకేతిక ఆధారాల ప్రకారం విజయవాడలోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి.
Login
Comments (0)