అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్లో ఆకస్మిక వరదలు తీవ్ర విలయం సృష్టించాయి. ఈ భారీ మెరుపు వరదల ధాటికి సుమారు 20 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో 15 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొలరాడో నదికి అనుసంధానంగా ఉండే బ్రైట్ ఏంజెల్ క్రీక్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కొట్టుకుపోయిన భారీ నిర్మాణాలు
వరద ప్రవాహం తీవ్రరూపం దాల్చడంతో నేషనల్ పార్క్ పరిధిలోని బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉధృతికి భారీ బండరాళ్లతో పాటు పలు లోహపు నిర్మాణాలు సైతం కొలరాడో నదిలోకి కొట్టుకుపోయినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులు, స్థానికులను రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ముమ్మరంగా గాలింపు చర్యలు
గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు నేషనల్ పార్క్ సర్వీస్ సిబ్బందితో పాటు అరిజోనా రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. కొద్దిరోజులుగా నేపాల్లో ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని మిగల్చగా, తాజాగా అమెరికాలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Don’t receive OTP? Resend