తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డిని సిట్ బృందం విచారించింది. ఆయన కార్యాలయానికే నేరుగా వెళ్లిన అధికారులు సుమారు నలభై నిమిషాలకు పైగా వివిధ కోణాల్లో ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
గతంలో జరిగిన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కోదండరెడ్డి ఫోన్ ను సైతం కొద్ది నెలల పాటు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆయన పేరు ప్రముఖంగా వెలుగులోకి రావడంతో దర్యాప్తులో భాగంగా అధికారులు ఇటీవల ఆయనకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ఆధారంగానే తాజాగా ఈ విచారణ కొనసాగినట్లు సమాచారం.
Don’t receive OTP? Resend