జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 30న ఈ వివాహం జరిగినట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించి, కొత్త జీవితం మొదలైందంటూ ఫొటోలు పంచుకున్నారు. దేశ రాజధాని దిల్లీ అలాగే శ్రీనగర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండో వివాహం. ఆయన గతంలో పాయల్‌ను 1994లో వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 2011 నుంచి వారు వేర్వేరుగా జీవిస్తున్నారు. తొలుత కుటుంబ న్యాయస్థానం, దిల్లీ హైకోర్టు వీరి విడాకుల అభ్యర్థనను తిరస్కరించాయి.
దీంతో వారు గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. సుదీర్ఘ కాలంగా వారు వేర్వేరుగా జీవిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని విడాకులు మంజూరు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేసిన మూడు నెలల వ్యవధిలోనే ఒమర్ అబ్దుల్లా ఈ వివాహం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Don’t receive OTP? Resend