ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన కార్యాలయం స్పందించింది. ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో ఉన్న వాట్సాప్ ఛానల్ అధికారికమైనది కాదని స్పష్టం చేసింది. కార్యాలయం పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ ఛానల్ను విశ్వసించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపవద్దని ప్రజలకు సూచించింది.
Don’t receive OTP? Resend