మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పర్యటన నిమిత్తం నగరానికి విచ్చేసిన అమిత్‌షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు మెగా హీరోలిద్దరూ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆప్యాయంగా పలకరించి, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.
భాజపా ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మహాపాదయాత్రలో పాల్గొనేందుకు అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, రామ్‌చరణ్ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో వారిద్దరూ కొంతసేపు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన వివరాలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Don’t receive OTP? Resend