2018 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు సోమవారం నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావని, ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా బాధిత వ్యక్తి కాదని కోర్టు పేర్కొంది. తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది సంతోష్ పాండే తెలిపారు. కోర్టు వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు ‘సత్యమేవ జయతే’ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.
Don’t receive OTP? Resend