అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం (నవంబరు 1) 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిది పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. మిగిలిన 92 సంస్థల్లో 13 నగరపాలక సంస్థలు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 2,382 స్థానాలకు 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలుత 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
Don’t receive OTP? Resend