అమరావతి: స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలకు తేనేటీ విందు ఇచ్చారు. వారి కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం సూచించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకునే వారిని నమ్మొద్దని మహిళలకు పిలుపునిచ్చారు.
Don’t receive OTP? Resend