అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట వద్ద బ్లాస్టింగ్ యంత్రం పేలి ఐదుగురు మృతి చెందారు. రోడ్డు పనుల కోసం జిలెటిన్ స్టిక్స్ అమర్చిన యంత్రంలో డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. మృతుల్లో డ్రైవర్, ముగ్గురు కార్మికులు, అటుగా వెళ్తున్న ఓ టీచర్ ఉన్నారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Don’t receive OTP? Resend