Bigg Boss Promo Today: తిండి లేక మా అమ్మ మట్టి తినేది.. ఏడిపించేసిన ఇమ్మానుయేల్.. తనూజ-కళ్యాణ్ ఎమోషనల్
బిగ్‌బాస్ సీజన్-9లో వచ్చే వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌కి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేశాడు బిగ్‌బాస్. వారికి సంబంధించిన చిన్ననాటి ఫొటోలని తెచ్చిపెట్టి వారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో తన తల్లి గురించి చెబుతూ తనూజ ఎమోషనల్ అయింది. ఇక తన చిన్నప్పుడు అమ్మ ఎంత కష్టపడిందో చెప్తూ ఇమ్మానుయేల్ కన్నీళ్లు పెట్టించేశాడు. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం.బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగనుంది. ఎందుకంటే హౌస్‌మేట్స్‌కి తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఎమోషనల్ చేసేశాడు బిగ్‌బాస్. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం.. వేలు పట్టుకొని నడవడం కొత్త విషయాలు నేర్చుకోవడం.. అలవాట్లు, కోరికలు.. ఆశయాలు, చిన్న చిన్న ఆశలు.. అన్నీ మొదలయ్యేవి బాల్యంలోనే.. అంటూ వారి ఫొటోలని హౌస్‌లో డిస్ప్లే చేశాడు.
Comments (0)