ఆ పేరుతో ఓ బూరె వంటకం ఉందన్న సంగతి మీకు తెలుసా..
అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాళ, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారాపూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని. బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.
ఘారాపూపకాలు : ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోసుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.
Login
Comments (0)