భోగాపురం ప్రారంభోత్సవం.. ఏయూ పరీక్షలు వాయిదా
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆంధ్ర వర్సిటీ పరిధిలో శనివారం జరగాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వాయిదా వేశారు. ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు, రవాణా అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. యూజీ పరీక్షలను ఆగస్టు 24కు, ఎంబీఏ, ఎంహెచ్ఆర్ఎం, పీజీ డిప్లొమా పరీక్షలను ఆగస్టు 5కు, బి.ఫార్మసీ పరీక్షలను ఆగస్టు 3కు నిర్వహించనున్నారు.
Login
Comments (0)