బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 57 ఏళ్ల నాటి చారిత్రక రికార్డును బద్దలుకొట్టాడు. కేవలం 15 సంవత్సరాల 157 రోజుల వయసులోనే అర్ధసెంచరీ సాధించి, దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈ మైలురాయిని అధిగమించిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
సమంగా నిలిచిన ఇరుజట్ల స్కోర్లు
రజత్ పటిదార్ సారథ్యంలోని సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ కూడా సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి. ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ సూర్యవంశీ 81 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 69 పరుగులతో రాణించగా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 16 పరుగులకే వెనుదిరిగాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్
ఈ మ్యాచ్లో కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, 1969లో లక్ష్మణ్ సింగ్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గతంలో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును తిరగరాశాడు. 2005లో పీయూష్ చావ్లా కూడా 16 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకుని జాబితాలో నిలిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబె 4 వికెట్లు పడగొట్టగా, ఆర్యన్ పాండే, యశ్ ఠాకూర్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.
Don’t receive OTP? Resend