రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని ప్రకటించడంతో పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి. 2021-22 సిరీస్ ఏడు సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూరేషన్ తేదీని నవంబర్ రెండవ తేదీగా ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో ఒక్కో యూనిట్ ధరను పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలుగా నిర్ణయించింది.
అప్పట్లో ఈ బాండ్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి గ్రాము ధర నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలుగా ఉండగా ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి యాభై రూపాయల డిస్కౌంట్ లభించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం మదుపర్లకు గ్రాముపై సుమారు తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు రూపాయల లాభం వచ్చినట్లయింది. అంటే మదుపర్లు రెండు వందల శాతానికి పైగా లాభాలు ఆర్జించారు.
సావరిన్ గోల్డ్ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు అయినప్పటికీ మదుపర్లు ఐదో సంవత్సరం తర్వాత నుంచి ముందస్తు ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గడువు ముగియకముందే నగదు కావాలనుకునే పెట్టుబడిదారుల కోసం ఆర్బీఐ ఈ తేదీలను ప్రకటిస్తుంది. రిడెంప్షన్‌కు ముందు వారం చివరి మూడు రోజుల ధరల సగటు ఆధారంగా ఈ ప్రీమెచ్యూర్ ధరను నిర్ణయించారు.
Don’t receive OTP? Resend