యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు: కేంద్రం
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు విధించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రూ.3,000 దాటిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం, ఆర్బీఐ పరిశీలిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. డిజిటల్ చెల్లింపులు యథావిధిగా పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం దేశంలో ప్రతి నెల 2,000 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతుండగా, వాటి విలువ రూ.25 లక్షల కోట్లకు పైగా ఉంది. 2016లో ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా ఎదిగింది. వినియోగదారులకు ఎలాంటి రుసుములు లేకుండా చెల్లింపులు జరగడం, క్యూఆర్ కోడ్ ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేయగలగడం వల్ల నగదు వినియోగం గణనీయంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో యూపీఐపై రుసుములు విధిస్తారన్న వార్తలు వినియోగదారులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగించాయి.
Login
Comments (0)