మహిళల క్రికెట్లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణి అనయ బంగర్ ఆడుతుండటంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మరిజెన్నె కాప్ తీవ్ర స్థాయి లో అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అనయ బంగర్ ఆడేందుకు అవకాశం కల్పించడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
అనయ బంగర్ నేపథ్యం
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడైన అనయ బంగర్, లింగ మార్పిడి చేయించుకుని మహిళగా మారారు. అంతకుముందు దేశవాళీలో పలువురు యువ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. మహిళగా మారిన తర్వాత తన క్రికెట్ కలను నెరవేర్చుకునేందుకు ఐసీసీ నిబంధనలపై పోరాటం చేశారు.
ఐసీసీ నిబంధనలు వర్సెస్ ఆసీస్ బోర్డు
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ 2023 నుంచి అమలు చేస్తున్న పాలసీ ప్రకారం ట్రాన్స్‌జెండర్ మహిళలకు అంతర్జాతీయ మహిళా క్రికెట్ ఆడేందుకు అనుమతి లేదు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం నిబంధనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కమ్యూనిటీ, ప్రిమియర్ క్రికెట్ ఆడేందుకు అనయకు ఆసీస్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కాప్ విమర్శలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Don’t receive OTP? Resend