పెరగనున్న కియా కార్ల ధరలు
కార్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బీఎండబ్ల్యూ, హ్యూందాయ్ వంటివి ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి కియా కూడా చేరింది. జులై 1 నుంచి తన మోడళ్ల ధరను 2 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడి సరకుల ఖర్చు, నిర్వహణ వ్యయం పెరగడమే ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది.
Login
Comments (0)