అర్నాబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ కుమార్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల రక్షణ, భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే పాఠశాలలు సీజ్
కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి ఆకస్మికంగా విద్యా సంస్థలు తెరిచినట్లు తేలితే తక్షణమే వాటిని సీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ఉపాధ్యాయులు, యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
Don’t receive OTP? Resend